తండ్రి పై ఒత్తిడి పెంచుతున్న చ‌ర‌ణ్..!

Chiranjeevi-Reveals-Ram-Cha

చిరంజీవి వెండి తెర‌పై ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయ‌ల్లోకి వెళ్ళాడు. మ‌ర‌ల రాజ‌కీయాల‌నుండి సినిమా ప్ర‌పంచంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టి చిత్రం ఖైది నెంబ‌ర్ 150వ చిత్రంతో మంచి విజ‌యంను ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా మెగా స్టార్ చిరంజీవి వ‌రుస‌గా సినిమాలు చేయ్యాలి అని అభిమానులు అన్నారు. మెగా స్టార్ కూడా ఇక‌పై వరుస‌గా సినిమాలు చేస్తాను అని చెప్పాడు కూడా, ఖైది నెంబ‌ర్ 150వ చిత్రం త‌ర్వాత సైరా చిత్రం చేయ్యాడానికి చాలా కాలం ప‌ట్టింది. ఇది పిరియాడిక‌ల్ నేప‌థ్యం క‌లిగిన చిత్రం. ఈ చిత్రంను త‌న‌యుడు చ‌ర‌ణ్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత మెగా స్టార్ త‌దుప‌రి చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తాడు అన్నా విష‌యం తెలిసిందే. ఈ మూవీ సోషియ‌ల్ మెసేజ్ క‌లిగిన చిత్రం. ఈ చిత్రం త్వ‌రలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

syeeraa-cheranjeevi

కొర‌టాల శివ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ మెగా స్టార్ పై ఒత్తిడి పెంచ‌నున్నాడు. చ‌ర‌ణ్ త‌న తండ్రి కొసం మ‌రో క‌థ‌ను సిధ్దం చేయ్యాలి అని యాక్ష‌న్ డైరక్ట‌ర్ బోయాపాటి శ్రీనుని కోరాడంటా! బోయపాటితో పాటు మ‌రి కొంతమంది పెద్ద పెద్ద డైరక్ట‌ర్ ల‌కు కూడా త‌న తండ్రికోసం క‌థ‌ల‌ను సిద్దం చేయ్యాలి అని సూచించాడు అని స‌మాచారం. త‌న తండ్రి వ‌రుస‌గా సినిమాలు చేయ్యాలి అవి తానే నిర్మించాలి అని చ‌ర‌ణ్ భావిస్తున్నాడటా. చిరంజీవి మాత్రం ఒక్క‌దాని త‌ర్వాత ఒక్క‌టి సినిమాలు చేయ్యాలి అని భావిస్తున్నాడు. చ‌ర‌ణ్ కొరిక మేర‌కు చిరంజీవి కూడా మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యాడంటా. చిరంజీవి వ‌రుస‌గా రెండు చిత్రాలు చేయ్యాలి అని సూచిస్తున్నాడు చ‌ర‌ణ్, కానీ ఆయన మాత్రం వ‌న్ బై వ‌న్ అంటు వ‌స్తున్నాడు.

Ram Charan Next Movie Title Thammudu