చిరు చిన్నల్లుడు సినిమాల్లోకి..!

chiranjeevis-daughter-srija-husband-coming-into-movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యామిలీ నుండి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నారు అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత మంది హీరోలు ఉన్నా ఇంకా మెగా ప్యామిలీ నుండి కొత్తగా ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు అదే చిరంజీవి సోదరి చిన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తాడని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై క్లారిటీ రాకుండానే మరో వార్త జోరుగా ప్రచారం అవుతుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రిజ భర్త కళ్యాణ్‌ను ఇండస్ట్రీకి తీసుకు రావాలని మెగాస్టార్‌ స్వయంగా భావిస్తున్నాడు. శ్రీజకు రెండవ పెళ్లి అయినా కూడా కళ్యాణ్‌ హీరో అవ్వాలనే కోరికతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనే టాక్‌ కూడా ఉంది. 

తాజాగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో కళ్యాణ్‌ ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇద్దరి మామల ప్రోత్సాహంతో త్వరలోనే కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అంటూ ఆ ఫొటోకు కామెంట్లు వస్తున్నాయి. త్వరలోనే కళ్యాణ్‌ సినిమా గురించి ఒక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ఉన్న హీరోల స్థాయిని కళ్యాణ్‌ అందుకుంటాడా అనేది చూడాలి. అమెరికాలో యాక్టింగ్‌ కోర్సును పూర్తి చేసిన కళ్యాణ్‌ ప్రస్తుతం డాన్స్‌ మరియు కొన్ని రకాల స్టంట్స్‌ను నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తల్చుకుంటే కళ్యాణ్‌ను స్టార్‌గా చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. సో… త్వరలో తెలుగు సినిమా పరిశ్రమలో మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న మాట. Inline image 1

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

నిఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌, కారణం..!

మహానుభావుడు మరో శతమానం అయ్యేనా?