Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తొగు సినిమా పరిశ్రమ మీద గత కొంత కాలంగా కొందరు చేస్తున్న విమర్శలను అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు నడుం భిగించారు. ఇటీవల ఒక మీడియా ఛానెల్‌లో తెలుగు హీరోయిన్స్‌ను దారుణంగా తిట్టడం జరిగింది. దాంతో పాటు ఇంకా పలువురు సినిమా ప్రముఖులను రోడ్డు మీదకు లాగేలా కొందరు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ పరువు గత కొన్ని రోజులుగా పోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా పరిశ్రమ పెద్దలు నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో భేటీ అయ్యారు.
ఇటీవల పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ వెనుక వర్మ ఉన్నట్లుగా పేర్కొనడం వంటి విషయాలపై ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అంతా కూర్చుని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యింది. అన్నపూర్ణస్టూడియోలో ఇప్పటికే భేటీకి ఏర్పాట్లు జరిగాయి అంటూ ఒక నటుడు అనధికారికంగా చెప్పుకొచ్చాడు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మపై నిషేదం విధించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇన్నాళ్లకు సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాలు కూడా ఏకతాటిపైకి రాబోతున్న కారణంగా అందరి దృష్టి ఈ భేటీపై ఉంది.