Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : సందీప్ కిషన్, మెహ్రీన్
నిర్మాత : చక్రి చిగురుపాటి
దర్శకత్వం : సుసీన్ తిరన్
మ్యూజిక్ డైరెక్టర్ : ఇమ్మాన్
ఎడిటింగ్ : కాశి విశ్వనాథన్
సినిమాటోగ్రఫి : లక్ష్మణ్ కుమార్
సందీప్ కిషన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో డబ్ అవుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డైరెక్ట్ సినిమా స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. తమిళంలో సందీప్ కిషన్‌కు మంచి మార్కెట్ ఉండటంతో తమిళంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇక తెలుగులో కూడా సందీప్‌కు మంచి క్రేజ్ ఉంది. పైగా సందీప్ తెలుగు కుర్రాడు అవ్వడంతో ‘కేరాఫ్ సూర్య’ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్, ట్రైలర్లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రాన్ని రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
హీరోయిన్ మెహ్రీన్ నటించిన చిత్రాలు వరుసగా సూపర్ హిట్స్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మెహ్రీన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఆమె సెంటిమెంట్‌తో ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. ‘నాపేరు శివ’ అనే చిత్రాన్ని తమిళంలో కార్తీతో తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘నా పేరు శివ’ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుని ఖచ్చితంగా సందీప్ కిషన్ కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుందనే నమ్మకంతో సందీప్ సన్నిహితులున్నారు.