Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు సక్సెస్‌లను అందుకున్నాయి. పెద్దగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయినా కూడా దర్శకుడు హను రాఘవపూడికి మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రాల తర్వాత దర్శకుడు హను చేస్తున్న చిత్రం ‘లై’. నితిన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించిన లై చిత్రం బడ్జెట్ నిన్న మొన్నటి వరకు సినీ వర్గాల్లో తెగ చర్చకు తెర లేపిన విషయం తెల్సిందే. నితిన్ మార్కెట్‌కు, దర్శకుడు హను రాఘవపూడి మార్కెట్‌కు సంబంధం లేకుండా ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడంపై అంతా ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సినిమా టీజర్ విడుదలయిన తర్వాత బడ్జెట్ పెట్టడంలో అర్థం ఉందని, నితిన్, దర్శకుడు హను ఆ స్థాయిలో కలెక్షన్స్‌ను ఈ చిత్రంతో రాబట్టగలరు అని, వీరిద్దరికి తోడు అర్జున్ కూడా తన వంతుగా ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతాడు అని సినిమా టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నితిన్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించడంతో పాటు, చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడని, ఇప్పటి వరకు నితిన్‌లో కనిపించని మాస్ యాంగిల్‌ను ఈ చిత్రంలో చూస్తారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ విడుదలైన వెంటనే సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అవుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ‘లై’ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా వుందనే టాక్ మొదలైంది.
మరిన్ని వార్తలు