క్రిష్‌ విడాకులు… ఆ హీరోయినే కారణం?

Director Krish to divorce with his wife Ramya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ‘వేదం’, ‘గమ్యం’ వంటి విభిన్న చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్రిష్‌ ఈమద్య కమర్షియల్‌ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలతో టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన బాలీవుడ్‌లో సైతం సత్తా చాటుతున్నాడు. గబ్బర్‌ చిత్రాన్ని చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న క్రిష్‌ తాజాగా మణికర్ణిక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్‌’ సినిమాకు సైన్‌ చేశాడు. సినిమాల పరంగా ఎంతో మంచి కెరీర్‌తో ముందుకు సాగుతున్న క్రిష్‌ వ్యక్తిగతంగా మాత్రం కాస్త ఒడిదొడుకులు ఎదురవుతున్నట్లుగా అనిపిస్తుంది. 2016లో వివాహం చేసుకున్న క్రిష్‌ విడాకులకు ధరఖాస్తు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం చేస్తున్న సమయంలో డాక్టర్‌ రమ్యను క్రిష్‌ వివాహం చేసుకున్నాడు. శాతకర్ణి ఆడియో వేడుక సమయంలో కూడా రమ్య గురించి క్రిష్‌ చక్కగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. వీరిద్దరి జంటకు మంచి పేరు దక్కింది. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో వీరిద్దరి మద్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు కూడా కలిసి జీవించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చి ఇక విడిపోవాలని నిర్ణయించుకున్నారు. క్రిష్‌ విడాకుల విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు, కాని ఈ విడాకులకు కారణం హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘కంచె’ చిత్రంతో ప్రగ్యాను క్రిష్‌ పరిచయం చేశాడు. ఆ సన్నిహిత్యంతోనే క్రిష్‌తో ప్రగ్యా క్లోజ్‌గా మెలుగుతూ వస్తుంది. ఇద్దరి మద్య సన్నిహిత్యం పెరిగిందని, అది కాస్త శారీరక సంబంధంకు కూడా దారి తీసిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే రమ్య విడాకులకు సిద్దం అయ్యింది అంటున్నారు. ఈ విషయమైపై క్లారిటీ రావాల్సి ఉంది.