విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 400లకు పైగా థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈమద్య కాలంలో ఇంత అత్యధికంగా 25 రోజులు ఆడిన సినిమా మరేది లేదు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా దుమ్మురేపుతున్న గీత గోవిందం చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని కొన్ని రికార్డులను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఖైదీ నెం.150 చిత్రం రికార్డును దక్కించుకునేందుకు సిద్దంగా ఉంది.
ఓవర్సీస్‌లో ఇప్పటికే టాప్ 10 జాబితాలో ఉన్న గీత గోవిందం చిత్రం చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత స్థానంలో ఉంది. అంటే ఖైదీ చిత్రం 8వ స్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ గీత గోవిందం 9వ స్థానంలో ఉంది. 20 వేల డాలర్లను వసూళ్లు చేస్తే ఖైదీ మూవీని క్రాస్ చేస్తుందని అంతా అన్నారు. తాజాగా ఆ రికార్డు క్రాస్ అయ్యి ఉంటుంది. ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. ఇక నైజాం ఏరియాలో కూడా చిరంజీవి ఖైదీ మూవీని క్రాస్ చేయబోతుంది. నైజాంలో ఖైదీ నెం.150 చిత్రం 19.4 కోట్లను వసూళ్లు చేసింది. తాజాగా గీత గోవిందం చిత్రం 19 కోట్లకు చేరువ అయ్యింది. మరో వారం రోజుల్లో ఆ కోటిని కూడా రాబట్టి 20 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. ఈమద్య వచ్చిన భరత్ అనే నేను, అంతకు ముందు వచ్చిన ఫిదా, సరైనోడు చిత్రాలు కూడా 19 కోట్ల వద్ద ఆగాయి. కాని గీత గోవిందం చిత్రం మాత్రం 20 కోట్లను దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.