నటీనటులు: విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న,నాగేంద్ర బాబు,సుబ్బరాజు,వెన్నెల కిషోర్,సత్యం రాజేష్,గిరిబాబు,అన్నపూర్ణ
దర్శకుడు: పరుశురామ్
నిర్మాత: బన్నీ వాసు
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: గోపీ సుందర్
అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా విజయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి స్పెషలిస్ట్ అయినా పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ వలన, రిలీజ్ కి ముందు వచ్చిన ఇంకేం ఇంకేం సాంగ్ వల్లా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీత గోవిందం ప్రేక్షకులకు అంచనాలను చేరుకుందా? లేదా తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథ :
గోవిందం (విజయ్ దేవరకొండ) ఒక కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. కాబోయే భార్య గురించి తనకంటూ కొన్ని అంచనాలు వుంటాయి. తన కలల రాకుమారి గీత (రష్మిక మంథాన) ఒక గుడిలో తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయిన గోవింద్ అనుకోకుండా ఒకసారి ఆమెతో కలిసి బస్సులో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక బలహీన క్షణంలో ఆమెకు లిప్ లాక్ ఇస్తాడు ఈ ఘటన ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. విజయ్ క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకున్న గీత ఏం చేసింది? వారిద్దరి ప్రేమ ఎలా ఫలించింది? విజయ్ గీతను ఎలా కన్వీన్స్ చేశాడు? వాళ్లిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.