తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి, టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉందని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి గత కొంత కాలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. ఈమె ఏ సమయంలో ఎవరిపై బాంబులు విసురుతుందో అంటూ అంతా కూడా భయపడుతు వస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమపై దాడి తగ్గించిన శ్రీరెడ్డి తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీపై దాడికి దిగింది. తమిళ ప్రముఖ దర్శకుడు కార్తి, లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సి ఇలా ప్రముఖులు తనను వాడుకునేందుకు ప్రయత్నించారు, కొందరు వాడుకున్నారు అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం అధ్యక్షుడు ఇప్పటికే విశాల్ స్పందిస్తూ శ్రీరెడ్డి విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా నడిగర్ సంఘం కోశాదికారి అయిన కార్తి స్పందిస్తూ శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, తనకు ఎవరి వల్ల అయితే ఇబ్బంది కలిగిందో వారిని వెంటనే శిక్షించాల్సిందిగా పోలీసులను కలిసి డిమాండ్ చెయ్యాలి. అంతే తప్ప నోటి మాటతో విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కార్తి అన్నాడు. సినీ ప్రముఖులపై విమర్శలు చేయడం వల్ల పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. శ్రీరెడ్డిపై కార్తి మొదటి సారి సీరియస్ అవ్వడంతో తమిళనాట చర్చ జరుగుతుంది.