ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారు హృదయాలను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లి పోయిన విషయం తెల్సిందే. తెలుగులో టాప్ పొజీషన్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానా అక్కడ కొంత కాలం తర్వాత తిరష్కరణకు గురైన విషయం తెల్సిందే. చిన్న గ్యాప్ తీసుకుని ఇలియానా టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో రీ ఎంట్రీతో ఈమె ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కాని షాకింగ్‌గా ఈమె లుక్ మరీ దారుణంగా ఉందనే టాక్ వినిపిస్తుంది. నేడు సినిమా విడుదల అయ్యింది. సినిమాలో ఇలియానా చాలా లావుగా కనిపిస్తుంది. పోస్టర్స్ మరియు ట్రైలర్‌లో కంటే సినిమాలో ఇంకా లావుగా ఈమె కనిపిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలియానా టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది.
ఇలియానా మరీ ఇంత లావుగా మాకు నచ్చలేదు అని, ఇంత లావుగా ఉంటే మాకు అక్కర్లేదు అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలియానా ఇప్పటికి అయినా బక్కగా అవుతుందో చూడాలి. సినిమాల్లో ఆఫర్లు కావాలి అంటే ఈమె కనీసం 10 కేజీలు అయినా తగ్గాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ుక్ విషయంలో ఇలియానా మొదటి నుండి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. సినిమా విడుదల తర్వాత ఆ విమర్శలు మరింతగా ఎక్కువ అయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం నిరాశ పర్చింది.