Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ గొంతుక అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కొన్ని వున్నాయి. అంబటి రాంబాబు , రోజా , వాసిరెడ్డి పద్మ , భూమన కరుణాకర్ రెడ్డి ఈ జాబితాలో వుంటారు. ఈ డైలాగ్ కింగ్స్ లో తొలి ముగ్గురు ఏమి మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. కానీ భూమన మాట్లాడితే అందులో ఏదో మేటర్ ఉందనుకుంటారు. అందుకే ఏ క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఆయన్ని తురుపు ముక్కగా వాడడానికి జగన్ ఇష్టపడతారు. ఇప్పుడు ముద్రగడ ని వైసీపీ పావుగా వాడుకోవడంలో కూడా భూమనదే కీలక పాత్ర అన్నది బహిరంగ రహస్యమే. అదే నమ్మకంతో నంద్యాల ఎన్నికల్లో కూడా పార్టీ నేతల్ని సమన్వయపరిచే బాధ్యతని భూమన భుజాల మీద ఉంచారు జగన్. ఎన్నికలకు నెలన్నర ముందు నుంచే భూమన ని నంద్యాల లో ఉంచారు జగన్. ఫలితాలు చూసాక మైండ్ బ్లాక్ అయ్యి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయని జగన్ తాను స్వయంగా ఒకరికి ఫోన్ చేశారట .
జగన్ రింగ్ చేసింది ఎవరికో కాదు భూమన కరుణాకర్ రెడ్డి కి. నాయకుడి దగ్గర నుంచి ఫోన్ అనగానే అలెర్ట్ అయిపోయారట భూమన. పరాజయ భారంతో కుంగిపోతున్న జగన్ ని ఓ పెద్ద దిక్కులా ఓదార్చడానికి రెడీ అయిపోయారట. అయితే భూమన ఫోన్ ఎత్తీఎత్తగానే జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారట. తండ్రి స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చి ముఖ్యమైన పని అప్పగిస్తే ఇంతలా నవ్వులపాలు చేస్తారా అని పెట్రేగిపోయారట. ఊహించని ఈ పరిణామంతో భూమన మౌనాన్ని ఆశ్రయించారట. దాదాపు పది నిమిషాల పాటు చెలరేగిన జగన్ విసురుగా ఫోన్ పెట్టాక భూమన మొహం చిన్నపొయిందట. అయితే పక్కనున్నవారికి అది తెలియకుండా ఏదో బాధలో ఉండి జగన్ ఓ మాట అంటే పడకూడదా అని అనడంతో అనుచరులు కూడా సైలెంట్ అయిపోయారట.
మరిన్ని వార్తలు: