విజయ్ దేవరకొండ టైం ప్రస్తుతం నడుస్తుంది. టాలీవుడ్లో ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు కోట్ల పారితోషికంతో సిద్దంగా ఉన్నారు. మరో వైపు దర్శకులు ఈయన కోసం కథలు సిద్దం చేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు దర్శకులు ఈయనతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మైత్రి మూవీస్ బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ఈ చిత్రంకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.
ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయం పక్కన పెడితే ఈ చిత్రం కోసం హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసేందుకు మైత్రి మూవీస్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఇటీవలే ‘ధడక్’ చిత్రంతో పరిచయం అయిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను టాలీవుడ్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. ఈమద్య మంచి పాత్ర వస్తే తప్పకుండా సౌత్‌లో నటిస్తాను అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అందుకే విజయ్ దేవరకొండకు జాన్వీ ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ పారితోషికం ఆఫర్‌కు జాన్వీ బెండ్ అయ్యి విజయ్ దేవరకొండతో నటిస్తే సంచలనమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.