కమల్ హాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసే పనిలో పడ్డారు. చాలా కాలంగా ఈ సీక్వెల్‌ను అనుకుంటున్నప్పటికి ఇద్దరు ఇతర ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లకు ఈ సీక్వెల్ పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే ‘భారతీయుడు 2’ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు శంకర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వేటలో సినిమాటోగ్రఫర్‌తో కలిసి తిరుగుతున్నాడు. ఈ సమయంలోనే ఈచిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం శంకర్ స్థాయి కేవలం తమిళ సినీ ఇండస్ట్రీనో లేదంటే సౌత్ సినీ ఇండస్ట్రీనో కాదు. బాలీవుడ్ రేంజ్‌లో శంకర్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ‘భారతీయుడు 2’ను అదే స్థాయిలో తెరకెక్కించేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలీవుడ్ రేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా బాలీవుడ్ స్టార్స్ సినిమాలో ఉండాలి. అందుకే అజయ్ దేవగన్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఈ విషయమై కమల్ హాసన్ మాట్లాడుతూ దర్శకుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక హీరోగా నేను పూర్తిగా సమర్ధిస్తాను, ఆయన ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే అజయ్ దేవగన్ విషయంలో కమల్‌కు ఎలాంటి సమస్యల లేదు అని తేలిపోయింది. కమల్‌తో పాటు అజయ్ దేవగన్ కూడా భారతీయుడు 2లో ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.