తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 మరి కొన్ని రోజుల్లో ముగియబోతుంది. ఈసారి బిగ్ బాస్ చాలా విభిన్నంగా జరుగుతుందని చెప్పుకోవాలి. బిగ్ బాస్‌లో ఉన్న కౌశల్ పేరుతో అభిమానులు కౌశల్ ఆర్మీ అంటూ ఒక సోషల్ మీడియా గ్రూప్‌ను క్రియేట్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌ను నిర్వహిస్తున్నారు. కౌశల్ ఎలిమినేషన్‌లో ఉంటే చాలు లక్షల్లో ఓట్లను కురిపిస్తున్నారు. కౌశల్ ఎలిమినేషన్‌లో ఉంటే సగంకు పైగా ఓట్లు ఆయనకు ఒక్కడికే పడుతున్నట్లుగా మా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేషన్‌ను ప్రేక్షకుల ఓట్లను బట్టి నిర్వహించడం లేదని, వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయిన పార్టిసిపెంట్స్‌కు ప్రేక్షకుల నుండి వచ్చిన ఓట్లను చూపించడం జరిగింది.
కమల్ స్క్రీన్‌పై ఇంటి సభ్యులకు వచ్చిన ఓట్లను చూపించడంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ప్రేక్షకుల ఓట్లను చూపించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. నామినేషన్‌లో ఉన్న వారికి వచ్చిన వారి ఓట్లను చూపించడం వల్ల అసలు విషయం తేలిపోతుందని ఈ సందర్బంగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగు బిగ్‌బాస్‌లో అది సాధ్యం కాదు. ఎందుకంటే కౌశల్‌కు వస్తున్న ఓట్లు చూస్తే ఇతర ఇంటి సభ్యుల ఆటపై ప్రభావం పడటంతో పాటు, కౌశల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతాడు. అందుకే నిర్వాహకులు ఓట్లను చూపించే సాహసం చేయడం లేదు. ఇక కౌశల్ ఆర్మీ మాత్రం దమ్ముంటే నాని ఓట్లను డిస్ ప్లే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వారం అయినా ఓట్లను చూపించాలని వారు కోరుతున్నారు.