రైల్లో హస్తప్రయోగం…కానీ బాధితురాలికి జైలు శిక్ష!

masturbation in train

ఈ మధ్య కాలంలో మహిళల ముందు వ్యక్తులు వెకిలి చేష్టలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ మహిళల ముందు హస్త ప్రయోగం చేసే విషయంలో నిందితుడి కంటే బాధితురాలే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తే? ఎలా ఉంటుందో తెలుసా, ఇప్పుడు చూడండి.  ఫ్రాన్స్ రాజధాని పారీస్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పారీస్ నుంచి పాయ్టియర్స్‌కు రైల్‌లో వెళ్తున్న నటాచా బ్రాస్ (37) అనే మహిళను ఓ వ్యక్తి వెంబడించాడు. ఆమె పక్కనే కుర్చొన్న వ్యక్తి హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆమె వంకే చూస్తూ ఈ పనికి పాల్పడ్డాడు. దీంతో బ్రాస్ అదంతా వీడియో తీసింది. రైల్వే పోలీసులను లింక్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో అది వైరల్ అయ్యింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు బ్రాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం నేరం. సోషల్ మీడియాలో ఎవరివైనా వీడియోలు పెట్టే ముందు తప్పకుండా అందులో ఉండే వ్యక్తుల అనుమతిని తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పోలీసులు బ్రాస్‌పై చర్యలు తీసుకోనున్నారు. ఆమె నిందితుడి అనుమతి లేకుండా, ముఖాన్ని బ్లర్ చేయకుండా యథావిధిగా వీడియోను పోస్టు చేసినందుకు భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా బ్రాస్ స్పందిస్తూ.. బహిరంగంగా హస్త ప్రయోగం చేసుకున్నందుకు నిందితుడికి 13,000 పౌండ్‌(రూ.11,27,839)ల జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష, విధించనున్నారని, నిందితుడి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించిన కారణానికి తనకు 40 వేల పౌండ్(రూ.34,70,275)ల జరిమానా, జైలు శిక్ష విధించవచ్చని తెలిపింది.