Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోటి రూపాయలకు కాస్త అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఆ సినిమా చూసి సురేష్‌బాబు వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో దాదాపు రెండు కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. ఆ సినిమా విడుదల తర్వాత ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా ముప్పై కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఒక అద్బుతమైన దృశ్య కావ్యం అంటూ ఆ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఒక క్లాస్ సినిమా, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కష్టమే అని అంతా భావించారు. కాని ‘పెళ్లి చూపులు’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’.
శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్‌లు జంటగా వివేక్ ఆత్రేయ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ‘మెంటల్ మదిలో’ చిత్రం ఈతరం యువత ఆలోచనలకు దగ్గరగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. అందుకే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సురేష్‌బాబు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చాడు. ‘పెళ్లి చూపులు’ తరహాలోనే అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. సురేష్‌బాబు వేలు పెట్టడంతో ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయ్యే అవకాశం ఉంది. అంతా బాగానే ఉంది కాని ‘మెంటల్ మదిలో’ సినిమా ‘పెళ్లి చూపులు’ స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తామని సురేష్‌బాబు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: