Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయనంతే అదో టైపు. దేశమంతా ఓవైపు మాట్లాడితే.. ఆయనొక్కరే మరోవైపు ఉంటారు. తలాఖ్ లో ప్రతివాది ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. కానీ దాని కంటే ముందు ఎంఐఎం ఎంపీ అసద్ స్పందించారు. ఛాన్స్ దొరికితే ముస్లిం వర్గానికి ప్రతినిధిగా అవతరించడానికి తహతహలాడే ఒవైసీ సుప్రీంకోర్టు తీర్పు అమలు కష్టమని వ్యాఖ్యానించి కేంద్రానికి సవాల్ విసిరారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కష్టమంటే అర్థమేంటి. మతపెద్దలు తలాఖే అమలుచేస్తారా. తలాఖ్ వద్దనేవాళ్లకు సామాజిక అడ్డంకులు సృష్టిస్తారా. సుప్రీం తీర్పుపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్న అసద్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అంటే సుప్రీం కోర్టుకు బోర్డు స్టాంప్ వేయాలా అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అసద్ తీరు చూస్తుంటే.. ఆయన ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేకిస్తున్నారని అర్థమైపోతోంది. మరి హైదరాబాద్ ఎంపీకి ముస్లిం మహిళలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అసద్ ఓటమికి వ్యూహం రెడీ చేస్తున్న బీజేపీ.. ఈ వ్యాఖ్యల్ని కూడా ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గత ఎన్నికల్లో ఒవైసీకి చెమటలు పట్టించిన బీజేపీ.. మరోసారి చుక్కలు చూపించడానికి రెడీ అవుతోంది
మరిన్ని వార్తలు: