ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పై జరిగిన దాడిని మంత్రి పరిటాల సునీత తోసిపుచ్చారు. జగనే కత్తితో పొడిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటన మీద అనవసరంగా గొడవలు చేసి ప్రభుత్వం, చంద్రబాబు విఫలమయ్యారంటూ నేరం మోపుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల ఉచ్చులో వాళ్లే పడ్డారని, ప్రజల కళ్లు గప్పి డ్రామాలాడాలనుకుంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని ఆమె చెప్పుకొచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవిని పట్టపగలే హత్యచేశారని ఎమ్మెల్యేగా ఉన్న తన భర్త చనిపోతే అప్పటి గవర్నర్ వచ్చి తనను కనీసం పలకరించనే లేదని అప్పట్లో చంద్రబాబు ఒక్కరే మా కుటుంబాన్ని ఆదుకున్నారని ఇప్పుడు కేంద్రం మొదలు అందరూ ఫోన్లు చేసి పరామర్సిస్తున్నారని ఆమె చెప్పుకోచ్చారు. నిజమే కదా ఆరోజున పరిస్థితిని తలుచుకుంటేనే వెన్నులో వణుకు వచ్చే స్థితి అటువంటి పరిస్థితుల్లో గవర్నర్ కనీసం పలకరించకపోవడం దారుణమే. ఈ లెక్కన చూస్తుంటే దాడి గురించి పూర్తిగా అందరికీ తెలియక ముందే జీవీఎల్ ఢిల్లీలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్ట్టడం, పవన్ ట్వీట్ చేయడం ఇవన్నీ అనుమానాలు కలిగించేవి లాగానే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.