Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శాంతి, సహనం కూడా ఫలితాలు ఇస్తాయి. అది కూడా నిత్యం కుట్రలు, కుతంత్రాలతో రావణకాష్టంలా రగిలే రాజకీయాల్లో కూడా పని చేస్తుందని చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ దాన్ని నిజం చేసి చూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. 2014 లో సీఎం అయిన దగ్గర నుంచి నంద్యాల ఉప ఎన్నికల దాకా ఆయన ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. అందులో మరీ ముఖ్యమైనవి ప్రధాని మోడీ చేతిలో తగిలిన ఎదురు దెబ్బలు, అనుభవాలు. బీజేపీ కి సొంత బలంతో కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి బాబుకి దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా నడిచింది కథ. ముందుగా రైతు రుణ మాఫీ వ్యవహారంతో మొదలై ఎన్నో సమస్యలు సృష్టించింది కేంద్రం .ఓ వైపు మిత్రపక్షం అంటూనే ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు వంటి అంశాల్లో కేంద్ర వైఖరి బాబుని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. ఆ నిస్సహాయ స్థితిని అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్న విపక్ష నేత జగన్ కి బీజేపీ కన్ను కొట్టి బాబుని ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టింది. హోదా కి ప్యాకేజ్ అంది. దానికి సై అన్నా నిధులు ఇవ్వకుండా తాత్సారం చేసింది.
చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షతో బీజేపీ పంచన చేరిన వారి మాటలు విని ఆయనకి మోడీ, షా ద్వయం ఎన్నో అగ్ని పరీక్షలు పెట్టింది. కొన్ని సందర్భాల్లో బాబు ఇబ్బంది గుర్తించి పార్టీ నేతలు బీజేపీ మీద విరుచుకుపడితే వారి ఆవేశానికి ఆయనే అడ్డుకట్ట వేయాల్సివచ్చింది. ఇక సామాన్య జనం కేంద్రం చేసిన మోసాన్ని కడిగిపారేస్తుంటే వారికి నచ్చజెప్పుకునే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఒకప్పుడు తన అపాయింట్ మెంట్ కోసం వేచి చూసిన మోడీ తాను అడిగినప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా జగన్ ని పిలిపించుకుని మాట్లాడినా బాబు ఓర్పు వహించారు. జగన్ కి కన్ను కొడుతూ బీజేపీ ఆడిన సయ్యాటకు నంద్యాల ఉప ఎన్నికల ఫలితంతో తిరుగులేని జవాబు చెప్పారు. ఆ ఫలితం రాగానే బాబు వ్యతిరేకులు మోడీ కళ్ళకు కట్టిన తెరలు తొలిగిపోయాయి. భవిష్యత్ అవసరాలు గుర్తుకు వచ్చాయి. ఆ వెంటనే భూమా కి అభినందనలు, ఆంధ్ర కి ఇళ్లు కురిశాయి. ఇకపై ఆంధ్రాకి ఇతోధిక సాయం చేస్తామని బీజేపీ అంటోంది. ఒకవేళ చంద్రబాబు సీఎం లా కాక తనకు ఎదురైన అవమానాల్ని వ్యక్తిగతంగా తీసుకుంటే ఆంధ్రాకి అపార నష్టం జరిగేది. అలా జరక్కుండా అన్ని ఇబ్బందుల్లోను సహనంతో వ్యవహరించి మోడీని గెలిచారు బాబు.
మరిన్ని వార్తలు: