నాగ్‌ ధనుష్‌ మూవీ ఏంటంటే…!

అక్కినేని నాగార్జున తాజాగా ‘దేవదాసు’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. నానితో కలిసి ఈ చిత్రంలో నటించిన నాగార్జున ఆ వెంటనే ధనుష్‌ తో కలిసి ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రూపొందబోతున్న ఈ చిత్రంకు స్వయంగా ధనుష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపుగా 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రస్తుతం మధురైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈచిత్రం షూటింగ్‌లో వచ్చే నెల నుండి నాగార్జున పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం అందుతుంది.

danush

ప్రస్తుతం నాగార్జున పోషిస్తున్న పాత్ర కోసం మొదట రజినీకాంత్‌ను ధనుష్‌ అనుకున్నాడు. అందుకే ధనుష్‌ ఆ పాత్రను చాలా పవర్‌ ఫుల్‌గా రాసుకోవడం జరిగింది. రజినీకాంత్‌ నో చెప్పడంతో ఆ పాత్ర చేసే ఛాన్స్‌ నాగ్‌కు దక్కింది. 600 ఏళ్ల క్రితం వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఇదిఒక పీరియాడిక్‌ సినిమా అంటూ ధనుష్‌ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 600 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. 600 ఏళ్ల క్రితం అంటే ఖచ్చితంగా రాజులు, రాజ్యాలు ఉంటాయి. అంటే నాగార్జున ఒక రాజ్యంకు రాజుగా కనిపించబోతున్నాడేమో అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. ఈమద్య కాలంలో పీరియాడిక్‌ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ చిత్రం తప్పకుండా తెలుగులో ఆకట్టుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

danush-nagarjuna