టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల సందడి కొనసాగుతున్న విషయం తెల్సిందే. వచ్చేవి వస్తూనే ఉన్నాయి, పోయేవి పోతూనే ఉన్నాయి, కొత్తగా మళ్లీ మల్టీస్టారర్ చిత్రాలు ప్రారంభం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కిన విషయం తెల్సిందే. త్వరలోనే నాని ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. నాని ఇటీవలే నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. నాగార్జున ఆ చిత్రంలో డామినేషన్ చేశాడు. నానిపై నాగార్జున డామినేషన్ క్లీర్‌గా తెలిసింది. దాంతో నాని మళ్లీ మల్టీస్టారర్ చిత్రాల జోలికి వెళ్లే అవకాశం లేదని అంతా భావించారు. కాని తాజాగా తన గురువు ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చేసేందుకు ఓకే చెప్పాడు.
తనను సినిమాల్లో హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంలో మరో హీరోగా నిఖిల్ కూడా కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నిఖిల్ యువ హీరోగాఈమద్య మెల్ల మెల్లగా స్టార్‌డంను దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో నానితో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్‌ఇ చ్చాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాని జెర్సీ, నిఖిల్ ముద్రలు పూర్తి అయిన తర్వాత మల్టీస్టారర్ చిత్రంలో చేయనున్నాడు. ఈసారి నిఖిల్‌పై నాని ఆధిపత్యం ఉంటుందేమో చూడాలి.