జగన్ అవినీతి కేసులో మోడీకి నోటీస్

Netherlands Court Gives Notices To PM Modi In Jagan Corruption Case
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ తో రాజకీయ ప్రయాణానికి సన్నాహం చేసుకున్న ప్రధాని మోడీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే నిప్పు లాంటి మోడీ అవినీతి తుప్పు పట్టిన జగన్ తో ఎలా కలుస్తాడని కామినేని లాంటి మంత్రులు ప్రశ్నిస్తున్న వేళ వైసీపీ తో రాజకీయంగా స్నేహం చేస్తే ఎలా ఉంటుందో బీజేపీ అర్ధమయ్యే విషయం బయటకు వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాని మోడీకి అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి నోటీస్ వచ్చింది. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
మారిషస్ కి చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్స్ భారత్ లో 115 కోట్ల పెట్టుబడి పెట్టింది . నలభై తొమ్మిది శాతం వాటా కోసం వాళ్ళు పెట్టిన మొత్తం అది . జగన్ , ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి కలిసి చేస్తామని చెప్పిన ఇందు టెక్ జోన్ ఐటీ సెజ్ కోసం ఈ పెట్టుబడులు వచ్చినా ఆ ఇద్దరు అవినీతి కేసులో ఇరుక్కుపోవడంతో ఆ సెజ్ పనులు ముందుకు సాగలేదు. పెట్టుబడి పెట్టిన మారిషస్ నష్టపోయింది. ఇదే విషయం మీద మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టుని ఆశ్రయించింది. 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మారిషస్ ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఆర్ధిక ,వాణిజ్య , న్యాయ , పట్టణాభివృద్ధి శాఖలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మోడీ తో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా నోటీసులు అనుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని ఓ ఆట ఆడిద్దాం అనుకున్న మోడీకి ఈ నోటీస్ తో దిమ్మ తిరిగి ఉంటుంది. ఇక బీజేపీ విస్తరణే లక్ష్యంగా ఏ పార్టీ తో అయినా జట్టు కట్టడానికి సిద్ధపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ నోటీస్ తో అయినా కమలనాథులకు అర్ధం అవుతుందని ఆశిద్దాం.