నితిన్‌ గరుడవేగ కన్ఫర్మ్‌..!

nithin next film with praveen sattaru

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ హీరో నితిన్‌ ఇటీవలే ‘లై’ చిత్రంతో పెద్ద షాక్‌ తిన్న విషయం తెల్సిందే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ ‘లై’ చేసి విఫలం అయ్యాడు. నితిన్‌ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్‌ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆసినిమాకు త్రివిక్రమ్‌ మరియు పవన్‌లు నిర్మాతలు అవ్వడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ సినిమా తర్వాత నితిన్‌ నటించబోతున్న సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

nithin and praveen sattaru

‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయ అవార్డు దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తార్‌ ఆ తర్వాత ‘గుంటూర్‌ టాకీస్‌’ చిత్రాన్ని తెరకెక్కించి మరీ వల్గర్‌గా ఉందనే విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌తో ‘గరుడవేగ’ చిత్రాన్ని చేసి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. దాంతో ఇతడితో సినిమాను చేసేందుకు నితిన్‌ ఆసక్తి చూపుతున్నాడు. చాలా రోజుల క్రితం ప్రవీణ్‌ సత్తారు ఒక కథను నితిన్‌కు వినిపించడం జరిగింది. ఆ కథను చేసేందుకు ఇప్పుడు నితిన్‌ ఓకే చెప్పాడు. ప్రస్తుతం చేస్తోన్న సినిమా పూర్తి అయిన వెంటనే వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో నితిన్‌, ప్రవీణ్‌ సత్తార్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది.