Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్లో చేసింది మాత్రం అస్సలు బాగోలేదు. నితీష్ మిస్టర్ క్లీన్ కావచ్చు. మోడీ క్రేజీ నేత కావచ్చు. కానీ ఇద్దరూ కలిసి రాజకీయాల్లో నైతిక విలువల్ని అథఃపాతాళానికి తొక్కేశారు. అయినాసరే ఇద్దరూ నీతివంతులనే ముసుగేసుకుని జనాన్న మోసం చేస్తున్నారనేది విశ్లేషకుల మాట. కాంగ్రెస్ కంటే దారుణంగా మోడీ ప్రవర్తిస్తున్నారని జనం అనుకోవడానికి ఎక్కువ సమయం పట్టేలా కనిపించడం లేదు. ఇక నితీష్ సంగతి సరేసరి.
బీహార్ లో సమర్థ సీఎంగా పేరు తెచ్చుకున్న నితీష్.. పచ్చి అవకాశవాది అనే ముద్ర కూడా వేయించుకున్నారు. మహాకూటమి ఏర్పాటు సమయంలో లాలూపై కేసుల్లేనట్లు.. ఇప్పుడే కొత్తగా వచ్చిపడ్డట్లు నితీష్ చెప్పడం విడ్డూరంగా ఉంది. లాలూ రైల్వేమంత్రిపై ఉన్న కేసులు తిరగదోడటం, తేజస్వి పేరును ఇరికించడం, తదనగుగుణంగా నితీష్ పావులు కదడపడం ఇంకా విచిత్రంగా ఉంది.
లాలూ లెక్క ప్రకారం 2020 ప్రకారమే నితీష్ సీఎం. తర్వాత తేజస్విని ముఖ్యమంత్రి చేయాలని లోపాయికారీ ఒప్పందం. అందుకే నితీష్ మోడీకి దగ్గరయ్యారని ఆయన సన్నిహితుల మాట. అదే నిజమైతే మోడీ మాత్రం మళ్లీ నితీష్ కే సీఎం పదవి ఇస్తారా అనేది డౌటే. మరి అలాంటప్పుడు ఎందుకు ఎన్డీఏలోకి వెళ్తున్నారంటే.. కనీసం కేంద్రమంత్రిగా అయినా సెటిలవ్వాలనే ఆలోచనట. ఇంత మాత్రందానికి.. ఇంత చేయాలా అని జేడీయూ క్యాడర్ ఆశ్చర్యపోతోంది.
మరిన్ని వార్తలు: