Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కి ఇటీవలే విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అర్జున్ రెడ్డి’. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ వర్షం కురిసింది. విడుదలకు ముందే భారీగా క్రేజ్‌ను పెంచుకున్న ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా విడుదల తర్వాత కూడా దుమ్ము రేపింది. ఈ సినిమా ఏకంగా 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా ఏకంగా మూడు నాలుగు రెట్ల లాభాలను తెచ్చి పెడుతుంది. ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కావడంతో ఖచ్చితంగా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోవాలి.
వేరే సినిమాలు అయితే అయిదు కోట్లకు తగ్గకుండా శాటిలైట్ బిజినెస్ జరిగేది. కాని ఈ సినిమా మూడు కోట్లకు కూడా అమ్ముడు పోవడం కష్టంగా మారింది. కారణం ఈ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ప్రైమ్ టైంలో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను లేదా సీరియల్స్‌ను ప్రసారం చేయకూడదు. అందుకే ఈ సినిమాను కొనేందుకు ఛానెల్స్ ముందుకు రావడం లేదు. ఒక వేళ కొనుగోలు చేసినా కూడా ప్రైమ్ టైంలో ఈ సినిమాను ప్రసారం చేయడం కుదరదు. మరో టైంలో ఈ సినిమాను ప్రసారం చేస్తే ప్రేక్షకుల నుండి ఆధరణ దక్కదు. అందుకే ఈ సినిమాను మూడు కోట్లకు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపడం లేదు. ఈ సమయంలో నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.
మరిన్ని వార్తలు: