‘నోటా’ ప్రివ్యూ

Nota Movie First Day Collections

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నోటా’. కేవలం 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 50 కోట్ల అంచనాలను మోస్తూ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గీత గోవిందం’ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసిన కారణంగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నాడు. ఆయన క్రేజ్‌ ఏస్థాయిలో ఉందో తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రేక్షకుడిని అడిగినా తెలుస్తుంది. అంతటి క్రేజ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

nota-pics-new

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోలు సీఎంలుగా చేసిన సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్‌లను దక్కించుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ కనిపించబోతుంది. ఇక ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా కూడా మారుతున్నాడు. ఆ కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విజయ్‌ దేవరకొండకు చాలా కీలకం. ఎందుకంటే ఈ చిత్రంతో తమిళంలో విజయ్‌ పరిచయం కాబోతున్నాడు. తమిళనాట ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయారు. అందుకే విజయ్‌ ఆ విజయాన్ని దక్కించుకుని రికార్డు సాధించాలని భావిస్తున్నాడు.