ఎన్టిఆర్ జీవిత చరిత్రను జాగర్లమూడి క్రిష్ బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ప్రధాన తరగనంపైన చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తుల గురుంచి మాట్లాడుకోవాలి అదే ఒక్కటి ఎన్టీఆర్ పాత్రలో కనిపించే బాలకృష్ణ, మరోక్కరు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో కనిపించే రానా. ఎందుకంటే వీరి చుట్టే కథ నడుస్తుంటుంది. ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని స్థాపించిన్నప్పుడు, ఎంతో మంది సిని, రాజకీయనాయకులు విమర్శలు చేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ ను ఎన్టీఆర్ ముచ్చెమటలు పట్టించాడు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్ది ఎవరు అంటే కాంగ్రెస్. ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ సన్నివేశాలు చాలానే ఉన్నాయంట. బాలకృష్ణ గొంతు ఎత్తి మరి కాంగ్రెస్ పార్టీని తిట్టిన సన్నివేశాలను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించారంట.
చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మొన్నటిదాక బీజేపి పార్టీతో జతకట్టి స్పెషల్ స్టేటస్ విషయంలో మోది గవర్నమెంట్ తో గొడవపడి, కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. ఇప్పుడు చంద్రబాబు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల భజన చేస్తున్నాడు. పొగడ్తలతో కాంగ్రెస్ పార్టీని ముంచేతుతున్నాడు. మొన్న జరిగిన తెలంగాణా ఎలక్షన్స్ లో ప్రజకుటమి పేరుతో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తో జతకట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ భజన చేస్తుంటే, ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రం బాలకృష్ణ కాంగ్రెస్ ను తన మాటలతో దుమ్ము ఎత్తిపోస్తున్నాడు. ఇప్పుడు ఆ సన్నివేశాలలోని వాయిస్ ను కాస్త తగ్గించారంట. మరల తెలంగాణాలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేస్తూ కొంతమంది తిడుతున్నారు. తెలంగాణా ఎలక్షన్స్ లో అనవసరంగా తెలుగు దేశం పార్టీ తో జతకటడం వలెనే తెలంగాణా ఎలక్షన్స్ లో ఓడిపోయం అని కాంగ్రెస్ సినియర్ నాయకులూ అసంతృప్తితో ఉన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లోని ఆ సిన్స్ ను మార్చకుండా అలాగే ఉండనివ్వాలని భావిస్తున్నట్లు చిత్ర బృందం ద్వారా తెలుస్తుంది.