తన వేలితో తన కన్నె పోడుచుకున్నట్టు ఉంది పాక్ పరిస్థితి, ఆవేశంలో ఊగిపోతూ సొంత పైలట్ నే పొట్టన పెట్టుకున్నారు పాక్ ప్రజలు. పాక్ ఫైటర్ జెట్ F16ను కూల్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్ పారాచ్యూట్ సాయంతో పాక్ లో దిగినా బతికి బట్టకట్టాడు. ఆ దేశ సైన్యం రెండు రోజుల తర్వాత అభినందన్ ను భారత్‌కు అప్పగించింది. అయితే. పాక్ ఫైటర్ జెట్ F16 కమాండర్ షహజుద్దీన్ మాత్రం తన సొంత దేశం పాక్ లో దిగినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. పాక్ ప్రజల అర్ధం లేని ఆవేశానికి ఆహుతి అయ్యాడు. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చివేశాడు.
ఆ దాడిలో అభినందన్ మిగ్ విమానం కూడా కూలిపోయింది. దీంతో ఆయన పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందికి దిగాడు. అలాగే, ఎఫ్-16 విమానం నుంచి పాక్ పైలట్ షహజుద్దీన్ పారాచ్యూట్ సాయంతో సేఫ్‌గా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దక్షిణం వైపు ఉన్న లామ్ వ్యాలీలో దిగాడు. అయితే అక్కడ షహజుద్దీన్ దిగగానే జనం అతడ్ని చుట్టుముట్టారు. పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్ పై దాడి చేసిన పాక్ ప్రజలు.. పొరపాటున తమ పైలట్‌ను కూడా భారత పైలట్‌గా భావించి చితకబాదారు. షహజుద్దీన్ ని భారత ఫైలట్ అనుకొని చావబాదారు. జనం కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఇంటర్నెల్ బ్లీడింగ్ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ షహజుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. దీన్నిబట్టి చూస్తుంటే ఒక రకంగా అభినందన్ అదృష్టవంతుడనే చెప్పాలి.