గోపీచంద్ 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పంతం’ చిత్రంకు నెగటివ్ టాక్ వచ్చింది. ఆశించిన స్థాయిలో పంతం చిత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే కలెక్షన్స్ మాత్రం పాజిటివ్‌గా వచ్చాయి. మొదటి రోజు ఏకంగా 4.5 కోట్లు వసూళ్లు నమోదు అయ్యాయి. గోపీచంద్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్స్‌గా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు వచ్చిన భారీ పబ్లిసిటీ మరియు పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమాకు మంచి వసూళ్లు వచ్చినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. టీజర్ మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. దాంతో సినిమాకు మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
‘పంతం’కు పోటీగా విడుదలైన చిత్రాల్లో ఏ ఒక్క చిత్రం కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి. దాంతో పంతం సినిమా వారం రోజుల పాటు ఒక రేంజ్ వసూళ్లను సాధించే అవకాశాలున్నాయి. పంతం చిత్రం నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే మరో 10 కోట్ల మేరకు వసూళ్లు సాధించాల్సి ఉంది. మొదటి వారం రోజుల్లో ఆ పది కోట్లను వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. గోపీచంద్ కెరీర్‌లో ఇదో మైలు రాయి చిత్రం కనుక ఈ వసూళ్లు సాదా సీదానే అని చెప్పక తప్పదు. అయితే సినిమా టాక్‌కు వచ్చే కలెక్షన్స్‌కు సంబంధం లేకుండా ఉంది. మొదటి వారం రోజుల్లో సినిమా 15 కోట్లను వసూళ్లు చేయగలిగితే మాత్రం సక్సెస్‌గానే చెప్పుకోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.