కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందన?

pawan-kalyan-response-on-maheshs-kathi-comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బిగ్‌బాస్‌’ షోకు వెళ్లి వచ్చిన తర్వాత కత్తి మహేష్‌ కాస్త అతిగా మాట్లాడటంతో పాటు, తానో సెలబ్రెటీలా పీల్‌ అవుతున్నాడంటూ మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం చేస్తున్నారు. అందుకు కారణం ఆయన పవన్‌పై విమర్శలు చేయడం. సహజంగా అయితే పవన్‌పై ఈగ వాలిన కూడా ఆయన అభిమానులు ఊరుకోరు. కాని కత్తి మహేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌కు నటన రాదని, రాజకీయాలు తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వాఖ్యలకు ఫ్యాన్స్‌ కొందరు కత్తి మహేష్‌తో సోషల్‌ మీడియా యుద్దం చేశారు. కాని పవన్‌ సూచన మేరకు కత్తి మహేష్‌పై ఎదురు దాడి ఆగినట్లుగా తెలుస్తోంది. 

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కత్తి మహేష్‌ కావాలని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, పాపులారిటీ కోసం కత్తి మహేష్‌ చేస్తున్న అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్వయంగా పవన్‌ సన్నిహితులతో చెప్పాడట. పవన్‌ ఫ్యాన్స్‌కు అదే మెసేజ్‌ వెళ్లింది. కత్తి మహేష్‌వంటి ఒక చిన్న వ్యక్తి మాటలను పట్టుకోవాల్సిన అవసరం లేదని ఎక్కువ మంది ఫ్యాన్స్‌ భావించి అతడిని వదిలేశారు. కొందరు మాత్రం ఇంకా సోషల్‌ మీడియాలో కత్తి మహేష్‌పై ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. త్వరలోనే ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పడాలని అంతా కోరుకుంటున్నారు. ఇటీవల తనను ఫ్యాన్స్‌ బెదిరించినందుకు పవన్‌ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశాడు కత్తి మహేష్‌. ఆ విషయంపై కూడా కొందరు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిపై సమంత కామెంట్స్‌

భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌

సైరాలో మరి కొందరు స్టార్స్‌ కూడా..!