నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రల్లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు, సహజ నటి జయసుధతో ఎన్నో హిట్ట్ చిత్రాల్లో నటించారు అవి డ్రైవర్ రాముడు, గజ దొంగ, మహా పురుషుడు, అడవి రాముడు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాల్లో నటించిన జయసుధ పాత్రకోసం Rx100 సినిమా తో మంచి విజయంను దక్కించుకున్నా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తిసుకోన్నున్నారు అని సమాచారం.
పాయల్ రాజ్ పుత్ కు, జయసుధ ముఖః కవళికలు దగ్గరగా ఉండటం తో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ లో ఛాన్స్ ఇచ్చి నట్టు టాలీవుడ్ లో టాక్ వస్తుంది. పాయల్ కూడా RX100 సినిమా తరువాత సినిమా ఆఫర్స్ వచిన్నా, మంచి సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే రాకుల్, తమన్నా, నిత్య మీనన్ లు ఎన్టీఆర్ తో నటించిన ఆనాటి తారల పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు బాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం ఎన్‌టిఆర్ కథానాయకుడు పేరు తో జనవరి 9 న సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. రెండోవ భాగం అదే నెల 24 న విడుదల చేస్తున్నారు.