జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు దక్కించుకున్న హరి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. గత మూడు నాలుగు రోజులుగా జబర్దస్త్ కమెడియన్ అంటూ చెబుతూ వచ్చిన పోలీసులు తాజాగా పేరును వెళ్లడి చేయడంతో పాటు, ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా కూడా ప్రకటించాడు. పలు జబర్దస్త్ స్కిట్స్‌లో లేడీ గెటప్ వేసే హరి గత కొంత కాలంగా తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఎర్రచందనంను కొందరి సాయంతో కొడుతూ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఇలా హరి కోట్లు సంపాదించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన డబ్బుతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు అంటూ కూడా సమాచారం అందుతుంది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఇటీవల శకలక శంకర్ హీరోగా తెరకెక్కిన ‘శంభో శంకర’కు పెద్ద మొత్తంలో ఫైనాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈయన పలు సినిమాలకు రహస్యంగా ఫైనాన్స్ చేస్తున్నాడని, దాంతో పాటు పలు ప్రాంతాల్లో ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేసి, హరిని మరిన్ని వివరాల కోసం కస్టడీకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డ హరి తన తోటి నటులను కూడా ఈ స్మగ్లింగ్‌కు వినియోగించుకున్నాడు. పలువురు ప్రైవేట్ ఉద్యోగులను ఈ దందాకు హరి వాడినట్లుగా చెబుతున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో వచ్చిన క్రేజ్‌ను స్మగ్లింగ్‌కు వాడినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో హరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో స్మగ్లింగ్‌కు ఈజీ అయ్యిందని పోలీసులు చెబుతున్నారు.