బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాధాకృష్ణతో ఒక సినిమా ఓకే చేసిన ఆయన ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాకపోవడంతో ఈ రెండు సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ప్రభాస్ బర్త్‌డే కావడంతో సాహో సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్‌ని వీడియో ద్వారా విడుదల చేశారు.
అబుదాబిలో 30 రోజుల పాటు జరిగిన యాక్షన్ ఎపిసోడ్ కోసం 60 రోజుల ప్రిపరేషన్, 400కి పైగా క్రూ పనిచేశారు. తాజాగా విడుదలైన వీడియో ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది . సాహో కూడా అభిమానులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని తెలుస్తుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. మరి ఆ యాక్షన్ సీక్వెన్స్ మీరు కూడా చూసెయ్యండి మరి.