Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ తరపు బృందాలు గ్రామీణ స్థాయి లో సమాచార సేకరణ మొదలెట్టాయి. అయితే ఫీల్డ్ స్టాఫ్ కి ప్రశ్నపత్రాలు ఇచ్చి వచ్చిన సమాధానాల ద్వారా డేటా విశ్లేషణ చేసే పాత పద్ధతికి ప్రశాంత్ టీం మంగళం పాడింది. దాని బదులు క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్ని కలిసే కొత్త పద్ధతికి తెర లేపింది. దీని కోసం పార్టీ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లేదా ఎమ్మెల్యే ఇల్లు లేదా కార్యాలయంలోనే మకాం వేస్తోంది ప్రశాంత్ టీం. అయితే ఈ పద్ధతిలో సమాచార సేకరణ వల్ల సదరు నాయకుడు మీద నిష్పక్షపాత సమాచారం సేకరించే వీలు ఉండదు. పైగా ఆతిధ్యం స్వీకరించిన ఇంటి యజమాని మీదే నిఘా వేయడం నైతికంగాను సమర్ధనీయం కాదు. అంత కన్నా ముఖ్య విషయం ఏమిటంటే సదరు ఇన్ ఛార్జ్ లేదా ఎమ్మెల్యే సమాచార సేకరణ కోసం పిలిపించే క్షేత్ర స్థాయి నాయకులు కూడా వారికి అనుకూలం అయిన వారుంటారు. దీని వల్ల క్షేత్ర స్థాయిలో చేసే సమాచార సేకరణ ఫలితం అంతంత మాత్రమే.
రొటీన్ సర్వే కి క్షేత్ర స్థాయి సమాచార సేకరణ అనేది కొత్త విషయమే గానీ అందులో అనుసరిస్తున్న పద్దతులతో మళ్లీ స్థానిక నేత ప్రాబల్యానికి లొంగిన పార్టీ శ్రేణుల వాణి మాత్రమే వినిపించే పద్ధతి కనిపిస్తోంది. దీని వల్ల సర్వే విధానం మారుతుంది తప్ప వచ్చే సమాచారం అదే అవుతుంది. మున్ముందు ఈ పద్ధతిలో మార్పు వస్తే తప్ప క్షేత్ర స్థాయి సమాచారాన్ని నిక్కచ్చిగా తెలుసుకోగలగడం సాధ్యం అవుతుంది. ఏదైనా జగన్ భారీ అంచనాలు పెట్టుకున్న ప్రశాంత్ టీం సైతం పాత తప్పులే చేస్తోంది.
మరిన్ని వార్తలు