Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
30 ఇయర్స్ పృథ్వీ ప్రస్తుతం యమ బిజీ కమెడియన్‌గా ఉన్నాడు. ప్రతి స్టార్ హీరో మరియు యువ హీరోలు కూడా పృథ్వీని తమ సినిమాల్లో కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే పథ్వీకి కుటుంబం నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు 33 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న పృథ్వీకి ఇప్పుడు కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. కొన్నాళ్ల క్రితం భార్య నుండి విడిపోయిన పృథ్వీ, సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన భార్య శ్రీలక్ష్మి తనను భర్త వేదిస్తున్నాడు, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు అంటూ విజయవాడ కోర్టులో ఫిర్యాదు చేసింది. తన భర్త నుండి నెలకు 10 లక్షలు భరణంగా ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది.
ఈ వివాదంపై పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ స్పందించాడు. తన తండ్రి గురించి తల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, చిన్నప్పటి నుండి కూడా ఆయన బాగానే చూసుకున్నారు. ఇటీవలే మా సోదరి వివాహాన్ని కూడా గ్రాండ్‌గా చేశారు. తన తల్లి వెనుక ఎవరో ఉండి ఆమెను ఇలా నడిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి అంటే పడని కొందరు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తన తండ్రి త్వరలోనే ఇండియాకు వచ్చి పూర్తి వివరాలను మీడియాకు చెప్తాడని సాయి శ్రీనివాస్ పేర్కొన్నాడు. పృథ్వీరాజ్ ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక ఇంతకు మించి మమ్ములను అడగవద్దని వీడియోను పోస్ట్ చేశాడు.
మరిన్ని వార్తలు: