Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీయంగ్ మన్ రాజశేఖర్ సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్‌ను దక్కించుకున్నాడు. రాజశేఖర్ చివరిగా సక్సెస్ ఎప్పుడు దక్కించుకున్నాడు అంటే ఆయన అభిమానులు కూడా ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఎన్నో ఫ్లాప్‌ల తర్వాత రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 25 కోట్ల బడ్జెట్‌తో గరుడవేగ చిత్రం నిర్మిస్తున్నారు అని తెలిసినప్పుడు అంతా కూడా షాక్ అయ్యారు. రాజశేఖర్‌పై ఎవరైనా అంత ఖర్చు పెడతారా అంటూ అవాక్కయ్యారు. కాని ఆ మొత్తం రాబట్టగల సత్తా గరుడవేగకు ఉందని తేలిపోయింది. గరుడవేగ ఓవర్సీస్లో కూడా సందడి చేస్తోంది. భారీ స్థాయిలో అంచనాలున్న గరుడవేగను ఓవర్సీస్లో అతి తక్కువ స్క్రీన్లలో వేయడం జరిగింది.
ప్రీ మియర్ షోల ద్వారా 60 వేల డాలర్లను వసూళ్లు చేసిన గరుడవేగ చిత్రం ఆ తర్వాత కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు 1.25 లక్షల డాలర్లను గరుడవేగ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. రాజశేఖర్ చిత్రం ఓవర్సీస్లో విడుదల అవ్వడం ఇదే ప్రథమం. ఇక సీనియర్ హీరోలకు అక్కడ పెద్దగా మార్కెట్ లేదు. కాని రాజశేఖర్ మాత్రం లక్ష డాలర్లను సునాయాసంగా వసూళ్లు చేసి రెండు లక్షల డాలర్ల వైపుకు పరుగులు తీస్తున్నాడు. వచ్చే వారంకు రెండు లక్షల డాలర్లను సునాయాసంగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియన్ కరెన్సీలో లెక్క చూసినట్లయితే ఓవర్సీస్లో గరుడవేగ ఖచ్చితంగా 1.5 కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు. ఇక ఆన్ లైన్రైట్స్ మరియు ఇతరత్ర రైట్స్ ద్వారా మరింతగా నిర్మాతల ఖాతాల్లో పడే అవకాశం ఉంది.