Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోకంలో ఓ చిత్రమైన పోకడ వుంది. అదేమిటంటే… పిల్లవాడు దారి తప్పితే వాడి స్నేహితుల్ని తప్పుబట్టడం, భర్త వ్యసనానికి పక్కనోళ్ళని ఆడిపోసుకోవడం. ఇప్పుడు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పూరి జగన్నాధ్ విషయంలోనూ ఇదే ఇంకోసారి నిరూపణ అయ్యింది. కష్టాల్లో వున్నారు కదా అని పలకరించడానికి వెళ్లిన వారి దగ్గర పూరి భార్య అంటున్న మాటలు ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నాయంట.
” పూరి జగన్నాథ్ చాలా మంచి వాడు, ఎప్పుడైతే ఛార్మీ వలలో పడ్డాడో అప్పటినుంచి ఆయనకి ఆర్ధిక కష్టాలు, అపజయాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు కూడా ఆమె వల్ల వచ్చిందే. ఆమె సోదరులకు డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయి. పంజాబ్ వెళితే వారి గుట్టు రట్టు అవుతుంది. ఆమె తెలివిగా పూరీని ఇందులోకి లాగింది. ఏదైనా గట్టిగా మాట్లాడితే పూరి ఇంటికి రావడం కూడా మానేస్తున్నాడని భయపడి చూసీచూడనట్టు ఉరుకుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది” అని పూరి భార్య లావణ్య తన సన్నిహితులతో వాపోతున్నట్టు ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజానిజాలు ఏమిటన్నది పక్కనబెడితే ఛార్మీ చెప్పినట్టు వినడానికి పూరి ఏమైనా చిన్న పిల్లవాడా ? ఏమీ తెలియని అమాయకుడా ? దాదాపు 50 ఏళ్ళకి దగ్గర్లో వున్న పూరి ఛార్మీ చెప్పినట్టు ఆడుతున్నాడంటే వినడానికే బాగా లేదు. చేయదల్చుకుంది చేసి పక్కనోళ్ళ మీద పడితే ఏమి ప్రయోజనం ?
మరిన్ని వార్తలు