తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన తమిళ హీరో, దర్శకుడు లారెన్స్ మరోసారి తన మానవత దృక్పదంను చాటుకున్నాడు. గతంలో పలు సార్లు ఎంతో మందికి సాయం చేసిన లారెన్స్ తాజాగా కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. దాదాపు పదిహేను రోజుల పాటు వదలో చిక్కుకున్న కేరళ ఇప్పుడిప్పుడే సామాన్య జీవనంకు సాగుతుంది. ఇన్నాళ్లు నానా ఇబ్బందులు పడ్డ కేరళ వాసులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. అయితే ఒక్కో సినిమాకు 30 నుండి 40 కోట్లు పారితోషిం తీసుకునే వారు కూడా సాయం చేసేందుకు వెనుకా ముందు ఆడుతూ అయిదు పది లక్షలు సాయం చేస్తున్నారు. కాని లారెన్స్ మాత్రం ఏకంగా కోటి రూపాయల సాయంను ప్రకటించాడు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు కేరళకు అత్యధిక సాయం ప్రకటించిన హీరోగా విజయ్ నిలిచాడు. ఆయన తన అభిమానులతో కలిసి 70 లక్షల సాయంను కేరళకు ప్రకటించడం జరిగింది. తాజాగా లారెన్స్ ఏకంగా కోటి రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చాడు. కేరళ సీఎంను ఈ శనివారం కలువబోతున్న లారెన్స్ తన సాయంను నేరుగా ఆయనకు ఇవ్వబోతున్నాడు. దాంతో పాటు వరద కారణంగా ఎక్కువగా నష్టపోయిన ప్రాంతంలో లారెన్స్ పర్యటించేందుకు సిద్దం అవుతున్నాడు. కేరళ సీఎం అనుమతితో ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లుగా స్వయంగా లారెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతో ఇంతో సాయం చేసి చేతు దులుపుకోకుండా లారెన్స్ ఇలా మానవతా దృక్పదంతో సాయం వరద బాధిత ప్రాంతంలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నాడు. లారెన్స్‌లా ఇతర హీరోలు కూడా తమకు తోచిన సాయంను ప్రకటించాలని జనాలు కోరుకుంటున్నారు.