Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించాలంటే గోదావరి బ్రిడ్జిను దాటాలి. అయితే గోదావరి బ్రిడ్జిపై వైయస్ జగన్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వంతెన బలహీనంగా ఉందని, పాదయాత్ర చేస్తే వంతెన ప్రమాదానికి లోనవుతుందని ప్రభుత్వం పాదయాత్రకు అనుమతిని నిరాకరించింది. ఈ మేరకు రాజమండ్రి డీఎస్పీ జగన్‌కు లేఖ రాశారు. ఎక్కువ మంది బ్రిడ్జిపైకి రావడం మంచిది కాదని పోలీసులు పేర్కొన్నారు. బ్రిడ్జి కండిషన్ సరిగా లేదని అందులో పేర్కొన్నారు. ముందుగా వైయస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు రౌతు సూర్యప్రకాశ్ తదితరులు డీఎస్పీని కలిసి రూట్‌మ్యాప్‌ను అందజేశారు.
ఈ నెల 12వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైయస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో కొవ్వూరు నుంచి రాజమండ్రికి వచ్చేందుకు గోదావరి బ్రిడ్జిపై అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని డీఎస్పీ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే బ్రిడ్జిపై పాదయాత్ర చేపట్టారుని, 2003లో వైయస్ రాజశేఖరరెడ్డి కూడా ఇదే బ్రిడ్జిపై పాదయాత్ర చేపట్టారని అలాంటిది ఇప్పుడు బ్రిడ్జి కండీషన్ లేదని అనుమతి నిరాకరించడంపై వైయస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రాజమండ్రిలో కూడా జగన్ బహిరంగ సభకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.