Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలూ ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా పడ్డాయి. రాజ్యసభ మొదలుకాగానే… టీడీపీ, వైసీపీ సభ్యులు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. ఏపీ ఎంపీలతో పాటు తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను పెంచాలని టీఆర్ ఎస్ ఎంపీలు, కావేరి నదీ జలాల సమస్యపై తమిళనాడు ఎంపీలు కూడా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు. లోక్ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ,వైసీపీ, తెలంగాణ ఎంపీలతో పాటు శివసేన, కాంగ్రెస్ సభ్యులు కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. సభ జరిగే పరిస్థితి లేదని భావించిన స్పీకర్ సుమిత్రామహాజన్ వాయిదా వేశారు. అనంతరం ఎంపీలంతా బయటకు వచ్చి గాంధీ విగ్రహం ముందు నిరసనలు కొనసాగించారు.