బాబాయి మాటను స్వీకరిస్తున్నాను…!

Ram Charan Adopts A Cyclone Hit Village On Pawan Kalyan Advice

తిత్లీ తుఫాన్‌ వల్ల శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు భారీగా నష్టపోయాయి. చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావం ఉత్తరాంధ్రను తీవ్రంగా నష్ట పరిచింది. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ పర్యటించాడు. పవన్‌ అక్కడ ప్రజలకు రామ్‌చరణ్‌ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు అని హామీ ఇచ్చాడు. తాజాగా పవన్‌ హామీపై చరణ్‌ స్పందించాడు. బాబాయి మాటను స్వీకరిస్తున్నట్టుగా సోషల్‌ మీడియా ముఖంగా తెలియజేశాడు. త్వరలోనే ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలోని నష్టపోయినవన్నీ తిరిగి బాగు చేయిస్తాను అంటూ చరణ్‌ చెప్పుకొచ్చాడు. అందుకు తన టీం కూడా రెడీ అవుతున్నారని చెర్రీ తెలియజేశాడు.

ram-charan-pawan

బాబాయి ఇచ్చిన ఈ సలహా తీసుకుంటున్నానను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, బాబాయి నన్ను ఇందులో భాగం చేయడం నాకు బాగా నచ్చింది అంటూ చెర్రీ చెప్పుకొచ్చాడు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. షెడ్యూల్‌ పూర్తి కాగానే దత్తత గ్రామం గురించి క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. బోయపాటి, చరణ్‌ల చిత్ర ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

pawan-ram