Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సక్సెస్‌ల కోసం తాపత్రాయ పడుతున్నాడు. ‘ధృవ’ చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా కూడా తప్పకుండా చరణ్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఇప్పటికే తేలిపోయింది. ఆ సినిమా తర్వాత చరణ్ మరో సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత సినిమాను కొరటాల శివ వంటి దర్శకుడితో చేస్తేనే అది సాధ్యం అవుతుందని చరణ్ భావిస్తున్నాడు. అందుకు చాలా రోజులుగా కొరటాల శివను ఒప్పించేందుకు తన వారితో ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఇన్నాళ్లకు సఫలం అయినట్లుగా తెలుస్తోంది.
రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఒక సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్‌కు వెళ్లాల్సిన సమయంలో క్యాన్సిల్ అయ్యింది. ఆ సమయంలో కొరటాల శివపై నమ్మకం లేక పోవడం వల్లే స్క్రిప్ట్‌లో మార్పులు చేయించాలని ప్రయత్నించారు. అయితే కొరటాల శివ మాత్రం తాను అనుకున్నట్లుగానే సినిమాను చేస్తాను అని తేల్చి చెప్పాడట. దాంతో చరణ్ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ బ్లాక్ బస్టర్ దర్శకుడు. అందుకే ఆయన దర్శకత్వంలో చేయాలని చరణ్ భావిస్తున్నాడు. చరణ్ సినిమాకు కొరటాల తాజాగా ఓకే చెప్పాడు. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా భరత్ అను నేను చిత్రాన్ని చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత చరణ్‌తో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. వచ్చే సంవత్సరం వేసవిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నాడు. చరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌లో చరణ్ హీరోగా చేయబోతున్న మొదటి సినిమా ఇదే కాబోతుంది. చరణ్ ప్రస్తుతం చేస్తున్న రంగస్థలం చిత్రం సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే.
మరిన్ని వార్తలు
భావన కేసుతో ఆ హీరోకు సంబంధం ఏంటి?
రాజీ దేనికి? ఎన్టీఆర్‌పై నింద నిజమా?