తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో గడుపుతున్న ప్రేమజంటపై కొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రియుడిని తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆదుండగులు ఆ దారుణమైన ఘటనను సెల్‌ఫోన్లో రికార్డ్ చేసి వారి వద్దనున్న నగలు, నగదు దోచుకున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయటపెడితే ఆ వీడియోలు బయట పెడతామని బెదిరింపులకు దిగారు.
అయితే తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాలిమలై ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వెలుగు చూడటంతో ఒక్కసారిగా జనాలంతా ఉలిక్కి పడ్డారు. ఇంత దారుణం జరిగిందా అంటూ వాపోయారు. కాగా అక్కడే ఓ సంస్థలో యువతి, యువకుడు ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. దీంతో ఒకే కంపెనీలో పని చేస్తుండటంతో లవ్ లో పడ్డారు. అయితే లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఆఫీస్ మూతపడటంతో ప్రేమజంట కలుసుకోలేకపోయారు. ఈ మధ్యనే లాక్ డౌన్ సడలింపులతో ఆపీస్ తెరుచుకోవడంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆఫీసు వర్క్‌తో పాటు ప్రేమ ఊసులు చెప్పుకుంటూ గడిపుతున్నారు.