అనుకు మరో ఛాన్స్‌

Amar Akbar Anthony movie Heroine anu Emmanuel fix
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించిన అను ఎమాన్యూల్‌ ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. కాని ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో అను ఎమాన్యూల్‌కు అవకాశాలు రావడం అనుమానమే అని అంతా భావించారు. కాని అజ్ఞాతవాసి పెద్దగా ఎఫెక్ట్‌ పడలేదు. అను ఎమాన్యూల్‌కు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు జోడీగా ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్న అను ఎమాన్యూల్‌ మరో రెండు చిత్రాలకు కమిట్‌ అయ్యింది. త్వరలోనే ఆ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేశారు. తాజాగా చిత్రీకరణలో కూడా అను ఎమాన్యూల్‌ పాల్గొంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో అను ఎమాన్యూల్‌కు అవకాశం రావడంతో హ్యాపీగా ఉంది. రవితేజ మూవీ సక్సెస్‌ అయితే అను ఎమాన్యూల్‌కు మరింతగా క్రేజ్‌ పెరిగే అవకాశం ఉంది. నా పేరు సూర్య చిత్రంతో మే మొదటి వారంలో అను ఎమాన్యూల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంవత్సరంలో మూడు లేదా నాలుగు సినిమాలు అయినా అను చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.