Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో మాస్ మహారాజ రవితేజ నేడు సిట్ అధికారుల ముందు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఉదయం రవితేజ సిట్ కార్యలయంకు వెళ్లాడు. రవితేజకు మద్దతుగా ఆయన వెంట పలువురు వెళ్లారు. ఆ సమయంలోనే రవితేజను అరెస్ట్ చేస్తాడనే వదంతులు మొదలయ్యాయి. ఆ వెంటనే రవితేజ ఫ్యాన్స్ చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున హైదరాబాద్ చేరుకోవడం మొదలైంది. మొదట పదులు, తర్వాత వందలు, ఆ తర్వాత వేలాది మంది నాంపల్లిలోని సిట్ కార్యాలయం వద్దకు భారీగా రవితేజ ఫ్యాన్స్ అంటూ చేరుకున్నారు. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు కష్టపడ్డారు.
ఈ విజువల్స్‌ను మీడియాలో చూపిస్తే అభిమానులు ఇంకా ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో మీడియాకు ఆంక్షలు విధించడం జరిగింది. మీడియాలో సిట్ కార్యలయం ముందు జరిగిన సంఘటనలు చూపించకుండా పోలీసుల ఉన్నతాధికారులు పావులు కదిపారు. మరోవైపు ఆఫీస్ వద్ద ఉన్న పలు వాహనాలను ద్వంసం చేసేందుకు రవితేజ అభిమానులు ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో పాటు, ఎక్కువ మంది పోలీసులు ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. రవితేజ విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని దాదాపు మూడు వందల పోలీసులు సిట్ కార్యలయంకు తరలించడం జరిగింది. అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం రచ్చ రచ్చ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు రవితేజను అరెస్ట్ చేయడం లేదు అంటూ ప్రకటించిన తర్వాత కాస్త శాంతించినట్లుగా అక్కడున్న వారు చెబుతున్నారు. రవితేజ బయటకు వచ్చే వరకు అక్కడే ఉంటామని ఇంకా భారీ జనాలు అక్కడే ఉన్నారు.
మరిన్ని వార్తలు: