అందుకే ‘బాహుబలి’ని ఫాలో అవుతున్న ‘సాహో’…!

Sahoo Movie Budget 300 Crore

ప్రభాస్‌ ‘భాహుబలి’ చిత్రం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రభాస్‌ తదుపరి చిత్రాలపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో సుజిత్‌ దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. మూడు వందల కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు చిత్ర యూనిట్‌. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని మొదటగా వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ అది కాస్త పంద్రాగస్టుకు మారింది. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి తగ్గకుండా ఉండడానికి చిత్ర యూనిట్‌ మంచి కాస్సెప్ట్‌ను పట్టింది.

గతంలో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన వీడియోలను ఒక్కోక్కటి విడుదల చేస్తూ జక్కన్న ఆ చిత్రంపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాడు. ‘సాహో’ చిత్ర టీం కూడా ఇదే తరహాలో ప్రచారాన్ని చేయబోతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోకు షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 అంటూ పేరును తగిలించారు. ఇలా సందర్భానుసారంగా ఒక్కో వీడియోను చాప్టర్‌ల వారిగా విడుదల చేస్తూ అంచనాలను అమాంతం పెంచాలని యూనిట్‌ వారు భావిస్తున్నారు. విడుదల ఆలస్యం అవుతుండడంతో ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లకుండా ‘సాహో’ టీం ‘బాహుబలి’ని ఫాలో అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి విడుదల చేసే విధంగా తెరకెక్కిస్తున్నారు.

sahoo