Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నెలల తరబడి సాగిన తమిళ నాటకానికి తెర పడిందని అందరూ అనుకుంటున్నారు. ఇటు పళని, అటు పన్నీర్ హ్యాపీగానే ఉన్నారు. కానీ బతికి చెడ్డ శశికళ మాత్రం ఆట ముగియలేదంటోంది. అవసరమైతే జైలు నుంచే వ్యూహం రచిస్తానంటోంది. విలీనంపై త్వరలోనే శశికళ ప్రకటన వస్తుందన్న ఆమె అనుచరుల మాటలు కొత్త ఆసక్తి రేపుతున్నారు. విలీనం తర్వాత గవర్నర్ ను కలిసి ఏం సాధిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
అసలు అన్నాడీఎంకేలో శశికళ ఉనికి లేకుండా చేయడం కాదు.. తమిళ రాజకీయాల్లోనే ఆమె శకాన్ని ముగించాలనేది బీజేపీ ప్లాన్. ఇప్పుడు చిన్నమ్మదూకుడు ఆమెకు ఎసరు తెచ్చేలాగే ఉంది. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళకు.. తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తెలుసు. అందుకే ఆలోగా చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఎందుకంటే యడ్యూరప్ప సీఎం అయితే శశికళను తొక్కేయడం ఖాయం.
ప్రస్తుత పరిణామాల్లో దినకరన్ కు ఇరవై మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతున్నారు. వీరంతా డీఎంకే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అలాంటప్పుడు మధ్యంతర ఎన్నికలు రాక తప్పదు. అప్పుడు డబ్బు పెట్టే శక్తి శశికళకే ఉందని వారు నమ్ముతున్నారు. కానీ బీజేపీ అందాకా రానిస్తుందా అనేది కీలకం. కష్టమనుకున్న విలీనం పూర్తిచేసిన కమలనాథులు.. ఎమ్మెల్యేలను దారికితెస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ శశికళ అనే ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.
మరిన్ని వార్తలు: