Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జైలుకు వెళ్లినా శశికళకు బుద్ధి రాలేదు. అధికారంపై మోజు చావలేదు. ఎలాగైనా పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడానికి చిన్నమ్మ ఆడుతున్న మెలోడ్రామా తమిళ రాజకీయాలంటేనే వెగటు పుట్టిస్తోంది. ఇంత నిస్సిగ్గుగా అమ్మను తనలో చూసుకోవాలంటూ శశికళ లేఖ రాయడాన్ని విపక్షం డీఎంకే కూడా నమ్మలేకపోతోంది. జయతో శశికళ తనను తాను ఎలా పోల్చుకుంటుందని అందరూ నివ్వెరపోతున్నారు.
జయలలిత ఆడ సింహం. ఆమె ఎన్నో అవమానాలకు తట్టుకుని.. ఎవ్వరూ అందుకోలేనంత ఉన్నత స్థాయికి ఎదిగారు. అందుకే ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. జనం మాత్రం జయను అభిమానించారు. చివరకు బెంగళూరు కోర్టుకు హాజరవుతున్న జయపై.. కర్ణాటక ప్రజలు కూడా పూలు చల్లారంటే.. ఆమెపై ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. అదే కోర్టుకు శశికళ వెళ్తుంటే సేమ్ సీన్ రిపీట్ కాకపోగా.. రాళ్లు పడ్డాయి.
అదీ జయ, శశికళకు మధ్య ఉన్న తేడా. ఆ సంగతి కర్ణాటక జనం స్పష్టంగా చెప్పాక కూడా శశికళ ఇలాంటి ఉత్తరాలు రాసి మరింత దిగజారుతున్నారని జనం అనుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కరోజు పోలీసులు సెలవు పెడితే.. జనమే శశికళను రాళ్లతో కొట్చి చంపాలన్న కసితో ఉన్నారు. అలాంటి ఆమెను సీఎం కాకుండా చేశారని బీజేపీపై కూడా కాస్త పాజిటివ్ ఫీలింగ్ వారిలో ఉంది. అందుకే కమలనాథులు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు:
మోడీ మాట బాబా చెప్పారా..?