Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. తాజాగా చిత్ర డేట్లను కూడా బాలయ్య అనౌన్స్ చేశాడు. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని మొదట ప్రకటన వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించే అవకాశం కనిపిస్తుంది. దర్శకుడు విషయం ఏమో కాని ఈ చిత్రంలో యువ హీరో శర్వానంద్ కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక నిర్మాత ఇటీవలే శర్వానంద్‌తో ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ పూర్తి జీవిత చిత్రాన్ని చూపించేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ యుక్త వయస్సులో ఉన్నప్పటి పాత్రను శర్వానంద్‌తో చేయించాలని భావిస్తున్నారు. మొదటి 20 నిమిషాల పాటు ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక ముందు ఏం చేశాడు, వచ్చిన కొత్తలో ఎలా జరిగిందనే విషయాలను చూపించబోతున్నారు. ఆ సన్నవేశాలకు గాను ఎన్టీఆర్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ వంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించే అవకాశం రావడంతో శర్వానంద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జూన్ లేదా జులైలో చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ‘ఎన్టీఆర్’ను తీసుకు రాబోతున్నారు.