Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహో ప్రభాస్ కు తొలి హిందీ సినిమా కాగా, శ్రద్ధాకపూర్ కు తొలి తెలుగు సినిమా. శ్రద్ధాకపూర్ కుతెలుగు ఎలా కొత్తో, ప్రభాస్ కు హిందీ అలా కొత్త. వారిద్దరూ ఈ రెండు భాషలు మాట్లాడటటంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలని అనుకుంటున్నారట. హిందీ నేర్చుకోటానికి ప్రభాస్, తెలుగు నేర్చుకోటానికి శ్రద్ధ ప్రత్యేక ట్యూటర్ లను పెట్టుకున్నప్పటికీ ఇలా సెట్ లో ఒకరికొకరు సాయం చేసుకోవటం ద్వారా త్వరగా భాషపై పట్టు వస్తుందని వారిద్దరూ భావిస్తున్నారట. హిందీ బాహుబలికి ప్రభాస్ కు శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. సాహోలో ప్రభాస్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశముంది.రూ.150కోట్ల బడ్జెట్ తోప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సాహోలో తెలుగుతో పాటు బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేశ్, మందిరా బేడీ, జాకీష్రాఫ్ సాహోలో నెగటివ్ రోల్స్ పోషిస్తున్నారు. 2018లో ఈ సినిమా విడుదల కానుంది.
మరిన్ని వార్తలు: